Saturday, September 15, 2012

ఏదైనా సైట్ లో Mobile Number ఇవ్వడం ఇష్టం లేదా? ఇలా తప్పించుకోండి (Bypass All SMS Verifications)



    ఈ మధ్య చాలా సైట్లలో రిజిష్టర్ చేసుకొనేటప్పుడు మన మెబైల్ నెంబరు అడగడం.. ఆ నెంబరుకు  మెసేజ్ పంపి అందులో ఉన్న నెంబరును verify చెయ్యమని అడుగుతున్నాయి....  మామూలుగా మనం  మన అవసరం కొద్దీ వాడుకొనే G mail, YouTube, Facebook వంటి సైట్లలో మన నెంబరు ఇస్తే ఉపయోగం ఉంది . (ఈ ట్రిక్ వాటికైనా వాడుకోవచ్చు అనుకోండి).. కానీ వాటిలో ఇలా తప్పుగా  చేస్తే మనకే కొంత నష్టం.

   అలా కాకుండా  ఒక చిన్న గేమ్ ఆడుకోవడానికి, లేదా ఒక చిన్న ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికో కుడా  సై ట్ లో రిజిష్టర్ అవ్వాలనుకోండి. దానికి కూడా మెబైల్ నెంబరు ఇవ్వాల్సి వస్తే ఎలా ఉంటుంది.. మీరే చెప్పండి..ఇక అప్పటి  పిచ్చి పిచ్చి మెసేజ్ లు, DND లో Registration ఇవన్నీ అవసరమా ?.  అలా ఎక్కడైనా మెబైల్ నెంబరు ఇవ్వడం ఇష్టం లేకపోతే  ఇలా చెయ్యండి.

1. ముందుగా http://receive-sms-online.com/ అనే సైట్ కి వెళ్ళండి.. అక్కడ కొన్ని నెంబర్లు కనపడుతాయి.. వాటిలో ఏదో ఒకటి కాపీ చేసుకోండి.

2. ఆ నెంబరును మీరు రిజిష్టర్ చేసుకొంటున్న  సైట్లో మెబైల్ నెంబర్ బదులు  ఇవ్వండి.
3. ఇప్పుడు ఆ నెంబరుకు SMS పంపబడుతుంది కదా....
4. ఈ receive SMS  సైట్  లో మీరు కాపీ చేసుకొన్న ఆ  నెంబరు మీద క్లిక్ చేస్తే ఆ మెసేజ్ కనపడుతుంది.
5. ఆ verification నెంబరు కాపీ  చేసుకొని మీ సైట్లో వెరిఫై చేసేయ్యండి.. సమస్య తీరిపోయినట్లే కదా.....

నేను వేరే నెంబరు నుండి  ఒక టెస్ట్ మెసేజ్ పంపాను చూడండి..
z

Friday, September 14, 2012

Easy గా ఫైల్ షేరింగ్ చేసుకోవడానికి..


ఏదైనా ఫైల్ ఫ్రెండ్ కు పంపాలి అనుకోండి... upload చెయ్యడం, download చెయ్యడం విడివిడిగా కాకుండా ఒకే సారి  ఈ సైట్ ద్వారా చేసుకో్వచ్చు...

1.  justbeamit.com అనే సైట్ ఓపెన్ చెయ్యండి..
2. మీరు పంపాలనుకున్న ఫైల్ ఎంచుకోండి..
3. ఇలా ఒక లింకు చూపిస్తుంది..దాన్ని మీ ఫ్రెండ్ కు ఇవ్వండి..


4. అతను దాన్ని క్లిక్ చెయ్యగానే uploading, downloading రెండూ ఒకే సారి జరుగుతాయి.. 

 దీనివల్ల మరో ఉపయోగం ఏంటంటే...మామూలు ఫైల్ షేరింగ్ సైట్లు వాడితే  మీరు పంపిన ఆ ఫైల్ కొంత కాలం ఆ సైట్ సర్వర్ లోనే ఉంటుంది..  దాన్ని ఎవరైనా download చేసుకోవచ్చు.. కానీ దీనిలో స్టోర్ అన్న మాటే లేదు.. ఇంకా.. download complete అవ్వగానే ఇక ఆ లింకు కూడా పని చెయ్యదు..

Site: http://justbeamit.com/

Monday, July 2, 2012

Virtual OS లో ఇలా పార్టీషియన్స్ చేసుకోండి. (VMWARE Player)

VM Ware Player లో OS ఇన్‍స్టాల్ చేస్తున్నప్పుడు సామాన్యంగా కొంత డిస్క్ space ను ఎంచుకొని అందులో OS ను install చేసేస్తాం.. అప్పుడు మనకు C Drive మాత్రమే వస్తుంది.. కానీ మీరు దానిలో కూడా ఇంకొన్ని Local Drives ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారనుకోండి.. ఇలా ప్రయత్నించండి..


1. ముందుగా ఆ OS ను shutdown చెయ్యండి.. తర్వాత Edit virtual machine 
settings పై క్లిక్ చేసి, అందులో hard disk అనే సెక్షన్ ఎంచుకోండి..
కుడి పక్కన ఉన్న utilities మెనూ నుండి expand అనే ఆప్షన్ ఎంచుకోండి.



2.దానిలో డిస్క్ స్పేస్ ‍ను ఎంచుకోవాలి.. మీరు ఎంత expand చెయ్యాలో దానికి ఇప్పుడు ఉన్న capacity ని add చేసి ఎంటర్ చేసి, తర్వాత expand అనినొక్కండి.
                                     
 
3. ఇప్పుడు ఆ OS లోకి బూట్ అయ్యి My Computer పై రైట్ క్లిక్ చేసి Manage అనే ఆప్షన్ ఎంచుకోండి.
అప్పుడు వచ్చే విండో లో Disk management అనే  సెక్షన్ ఎంచుకోండి
అక్కడ మీరు ఎంచుకున్న extra space, Unallocated  space అని చూపిస్తుంది.. దానిపై రైట్ క్లిక్ చేసి create new partition ద్వారా ఎన్ని drives కావాలో అన్నిగా విభజించుకోండి..




కంప్యూటర్ క్షణాల్లో restore చేసే software... (ROLL BACK)


మామూలుగా సిస్టంలో  ఏదైనా  ప్రాబ్లంస్ వచ్చినప్పుడు  system restore అనే ఆప్షన్ ద్వారా  ఒక రీస్టోర్ పాయింట్ ఎంచుకొని ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంటాం కదా..... కానీ ఆ రీస్టోర్ పాయింట్స్  మనం manual గా కానీ, ఏదైనా critical software కానీ install చేసేటప్పుడు మాత్రమే తీయబడుతాయి..అందులోనూ సిస్టం బూట్ అవ్వలేని పరిస్ధితికి వచ్చినప్పుడు అవి ఎందుకూ పనికి రావు...



అలాంటి పరిస్డితులలో సైతం పని చేసే software ROLLBACK ఇది నిమిషాలు, గంటల వ్యవధిలో అనేక snaps తీసి ఉంచుతుంది... ఇంకా ఇదిOS బూట్ కాలేని stage లో సైతం home key ప్రెస్ చేస్తే పని చేస్తుంది..కంప్యూటర్ కు వైరస్ వచ్చినా సైతం Rollback చేసుకొని హ్యాపీగా ఉండచ్చు..


సో..ఏ ప్రాబ్లం వచ్చినా  os చెయ్యవలసిన పనే ఉండదు.. సెకన్లలో softwares తో సహా రీస్టోర్ చెయ్యబడతాయి.


ది Ghost software లాగా నిమిషాల టైం తీసుకోదు.. అంతా సెకన్లపై రీస్టోర్ చేసేస్తుంది 


కానీ ఇది ఫ్రీ కాదండోయ్....


Site: http://www.rollbacksoftware.com/

ఇంకా బాగా అర్దం కావాలంటే ఈ వీడియో చూడండి




Youtube వీడియోలకు Desktop player


Youtube వీడియోలను Desktop నుండే ప్లే చేసుకోవడానికి ఈ ప్లేయర్....

దీనిలో ప్లే లిస్టులు తయారు చేసుకొని వాటిని డెస్క్ టాప్ నుండే చూసేయచ్చు....

వీడియోలను ఎంతో సులభంగా సెర్చ్ చేసి ప్లే లిస్టులో add చేసుకోవచ్చు.. ఇంకా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి...

official site:   http://www.ytubeplayer.com
 

Virtual Mode లో సిస్టం రన్ చెయ్యడానికి Time Freeze software

కంప్యూటర్‍‍ను Virtual Mode లో రన్‍చేస్తే వైరస్‍లకు గురికాదు. అందుకోసం చాలా మంది Deep Freeze, Returnil system safe వంటి software వాడుతూ ఉంటారు...

Time Freeze అనే ఈ software కూడా అదే పని చేస్తుంది..అందులోనూ ఫ్రీ వేర్.... వాడడం కూడా ఎంతో సులభం... 

దీనిని install చేసాక freeze mode ఆన్ చేసుకుంటే మన కంప్యూటర్ virtual mode లో రన్‍అవుతూ C drive లో చేసిన మార్పులన్నీ ఇక సేవ్ కావు.. సో మన కంప్యూటర్ వైరస్‍ల నుండి రక్షించబడినట్టే.... ఎప్పుడైనా మీరు ఉద్దేశపూర్వకంగా ఏదైనా software install చేసి ఉంటే... Real disk లోకి ఆ ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు...


దీనిలో File protection mode అనే దానిలో మనం ఎంచుకున్న పైల్స్ ను ఇంకెవరూ మార్పుచెయ్యకుండా చెయ్యడానికి ఆప్షన్స్ ఉన్నాయి..

Official site: http://www.toolwiz.com/products/toolwiz-time-freeze/


 

Photo లను ఆన్‍లైన్‍లో ReSize చేసుకోవాలంటే

  మామూలుగా మనం తీసిన పోటోలు కానివ్వండి.. లేక   ఏదైనా Images కానీ దాదాపు ఎక్కువ resolution లో ఉంటే వాటిని  నేరుగా  బ్లాగులలోకి కానీ , వెబ్ సైట్స్ లోకి కానీ అప్‍లోడ్ చేస్తే లోడింగ్ టైమ్  మరియూ మన స్పేస్ వృధా అవుతుంది కదా... 

సో అలాంటి Images ని ఆన్‍లైన్ లోనే ఎడిట్ చేసుకొని optimized images పొందాలంటే  http://webresizer.com  అనే సైట్ ఉపయోగపడుతుంది... దీనిలో మీరు re-size చెయ్యవలసిన Image ని upload చేసి  రకరకాల ఎడిటింగ్స్ చేసి optimized image ని డౌన్‍లోడ్ చేసుకోవచ్చు..


site: http://webresizer.com/resizer/

ఇంటర్నెట్ కనెక్షన్ Slow గా ఉందా వీడియోలను ఇలా చూడండి




మీకు ఈ మెయిల్ ఎలా వెళ్తుందో తెలుసా ?

మనం పంపిన ఈ మెయిల్ ఎలా వెళ్తుందో తెలుసుకోవాలని ఉంటే ఈ లింకు చూడండి

అక్కడ ఉన్న start the history అనే బటన్ ను నొక్కండి....

Sunday, July 1, 2012

టైపింగ్ నేర్చుకోవడానికి మంచి Website

నేను ఈ రోజు ఈ సైట్ చూసాను...


ఆన్‍లైన్ లో  టైపింగ్ నేర్చుకోవడానికి   http://typingclub.com/   అనే ఉచిత   సైట్ చాలా బాగుంది... ఒక్కొక్క లెసన్ కంప్లీట్ చేసాక ఇంకోటి ఒపెన్ అవుతుందన్నమాట...  

దీనిలో  ఫ్రీ గా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు ఎక్కడ దాకా నేర్చుకున్నారో ఆ లెసన్ దాకా store చేసుకోవచ్చు.. లేదంటే వేరే కంప్యూటర్ నుంది ఓపెన్ చేసారనుకోండి మరలా మెదటి నుండి మెదలుపెట్టవలసి వస్తుంది.. (Facebook ద్వారా కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు)


దీనిద్వారా టైపింగ్ సులభంగా నేర్చుకోవచ్చు... ఒకసారి ప్రయత్నించండి...


సైట్:  http://typingclub.com/

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు password సెట్ చేసుకోండి...


   గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కు password సెట్ చేసుకోవాలంటే
  Simple start up password  అనే add-on installచేసుకోండి.
 ఇక  Settings > Tools > extensions అనే విభాగంలోకి వెళ్ళి ఆ Extension  మీద ఉన్న   options  మీద క్లిక్ చేసి ఒక password ఎంచుకొని Save చెయ్యండి. (see fig-2 &1)

ఇకపై మీరు Google chrome ఒపెన్ చెయ్యగానే ఇలాpassword ఇస్తేనే బ్రౌజింగ్ చెయ్యచ్చు....





YouTube వీడియోలు Download చెయ్యడానికి Firefox Add-on

   యూట్యూబ్ లేదా  గూగుల్ వీడియోస్ లాంటి వీడియో సైట్ల నుండి వీడియోలను  downloadచేసుకోవడానికి  ఎటువంటి ఇతర software’s పనిలేకుండా Firefox వాడేవారు ఇక్కడ క్లిక్ చేసి చిన్న ఆడాన్install  చేసుకుంటే  ఇలా ఇకపై వీడియోలను ఇలా కావలిసిన క్యాలిటీతో download చేసుకోవచ్చు...




















దీనిలో ఇంకొన్ని స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.. దీనిలో అందించే చిన్న converter install చేసుకుంటే ఆ వీడియోలను కావల్సిన ఫార్మాట్ లోకి convert చేసుకోవచ్చు..





వీడియోలను సేవ్ చేసుకోవడానికి ఇంతకు మునుపు పోస్టులో  

 YouTubeవీడియోలనుDownload కాదుఇలాSaveచేసుకోండి  అని రాశాను.. ఆ విధంగా కూడా downloadచేసుకోవచ్చు... Click here to see the post

లేదా  http://freecorder.com/  అనే సైట్ నుండి freecoder అనే చిన్న software ను install చేసుకుంటే ఇలా ఒక టూల్ బార్ వస్తుంది దాని ద్వారా కూడా సులభంగా సేవ్ చేసుకోవచ్చు.....




చదవగానే డిలీట్ అయిపోయే మెసేజ్ పంపాలా?

ఏదైనా సీక్రట్ మెసేజ్  మెయిల్ లో  మీ ఫ్రెండ్స్ కు పంపాలి అనుకోండి... ఇలా చెయ్యండి..


ముందుగా https://privnote.com/ అనే సైట్ ఓపెన్ చెయ్యండి...
దానిలో ఏ సందేశం పంపాలో దాన్ని టైప్ చేయ్యండి.. తర్వాత Create note అని క్లిక్ చెయ్యండి.. 
అప్పుడు  ఒక లింకు చూపిస్తుంది.. దాన్ని కాపీ చేసుకోని మీ ఫ్రెండ్ కు మెయిల్ చెయ్యండి..
ఆ లింకును అవతలవారు క్లిక్ చేస్తే వారికి మెసేజ్ కనపడుతుంది.. కానీ ఇక రెండవసారి క్లిక్ చేస్తే ఉండదు...

అవతలవారు ఎప్పుడు చదివారో కూడా తెలుసుకోవడానికి అక్కడ క్రింద మన మెయిల్ ఐడీ ఇవ్వచ్చు.. 

కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా... కళ్లను ఇలా రక్షించుకోండి



కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటాం....
పగలు చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ రాత్రి సమాయాలలో Screen  చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది.అలాంటప్పుడు brightness తగ్గించుకొని చూస్తుంటాం... 

అలా కాకుండా మనం ఉంటున్న  ప్రదేశం ను బట్టి, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ Brightness, colors మార్చిపెట్టే software ఉంటే బాగుంటుంది కదా..

అలాంటిదే ఈ Flux అనేది. ఇది సూర్యాస్తమయ  సమయాన్ని, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ రంగులు, వెలుగు మార్చి మన కళ్లను రక్షిస్తుంది. కేవలం 546KB మాత్రమే ఉన్న ఈ టూల్ చాలా బాగుంది.


ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.  Click Here

మీరు పంపిన మెయిల్ చదవబడిందా లేదా తెలుసుకోండి..

భవిష్యత్తులో పంపవలసిన మెయిల్స్ ను ముందుగానే ఎలా సెట్ చేసుకోవచ్చో.. నా పాత పోస్టు Gmail లో Future Emails ఇలా పంపండి  లో చెప్పాను... 

ఇప్పుడు దానిలోనే ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది.. మీరు పంపిన మెయిల్ చదవబడిందా లేదా అని ట్రాక్ చెయ్యవచ్చు..

అది ఎలాగో ఈ వీడియోలో చూడండి..



ఆడాన్ ను ఇక్కడ నుండి Install చేసుకోండి http://www.rightinbox.com/

ఇకపై మెయిల్ పంపేటప్పుడు Track అని క్లిక్ చేస్తే చాలు, ఎదుటి వాళ్ళు చదివి నపుడు మనకు మెయిల్ వస్తుంది..



Email ID హ్యాక్ అయితే నాకేం అనుకుంటున్నారా?


Email హ్యాక్ అయితే ఏమవుతుందో నాకు అంతగా  తెలీదు.. కానీ తెలిసిన రెండు ముక్కలు రాస్తా...    

నా ఫ్రెండ్స్ కొందర్ని అడినప్పుడు ఇలా అన్నారు.... " నా మెయిల్ లో ఏముంటాయి ? తొక్కలో మెయిల్స్ అంతే కదా  హ్యాక్ చేస్తే వాడికే టైం వేస్టు....  అది పోతే ఇంకోటి ఓపెన్ చేసుకుంటాను... "

వినడానికి బాగానే ఉంది... కానీ అసలు హ్యాక్ చేసినవాడు ఏం చెయ్యచ్చు.....?

మీరు అనుకుంటారు.. పోతే మెయిల్ ఐడీ యే కదా అని.... అదే కాదు మీకు సంబంధించిన అన్నీ అకౌంట్లు మీరు కోల్పోయినట్టే... ఎలా అంటారా ?   పూర్తిగా చదివితే అర్దం అవుతుంది..
 గూగుల్ అకౌంట్ తీసుకుంటే మెయిల్ తో పాటు దానికి సంబంధించిన Youtube, Orkut, Google+ , Blogger, Picasa లో ఉన్న మీ ఫోటోలు.. ఇంకా అన్ని గూగుల్ ప్రోడస్ట్స్ వాడికి ఇచ్చేసినట్టే.....   ఆయా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఏదైనా చెత్త కంటెంట్ పెడితే మీ ఫ్రెండ్స్ మీరు కాదు అలా చేసింది అంటే నమ్ముతారా ?   నమ్మరు.. నానా అవస్ధలు పడాలు ఒప్పించడానికి....  కష్టపడి రాసుకున్న బ్లాగులు పోతాయి.. ఎలా ఉంటుంది అసలు..

మీరు మెయిల్స్ లో చాలా చోట్ల అడ్రస్ ఇచ్చి ఉండచ్చు.. పోన్ నెంబర్లు ఉండచ్చు... వాటి సంగతి ఏంటి ?   
ఆ హ్యాకర్ మీ ఐడీ నుండీ ఏదైనా సంఘవిద్రోహ శక్తులకు మెయిల్స్ చేస్తే  ప్రభుత్వం నుండి ముప్పు వచ్చేది ఎవరికి ? మీకు కాదా ?  నేను ఎక్కడ ఉంటానో ఎలా తెలుస్తుంది అంటారా ?   గూగుల్ password recovery కి మెబైల్ నెంబరు ఇచ్చి ఉంటారు..ఇంకెక్కడైనా ఇచ్చే ఉంటారు.... దాని ద్వారా మిమ్మల్ని పోలీసులు పట్టుకోవచ్చు...  మీరు ఇవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ లిస్టుద్వారా నైనా(వాళ్ళు ఇచ్చుకోని ఉండచ్చు) , logging locations బట్టి  మిమ్మల్ని పట్టుకోవడం పెద్దపనేం కాదు.....  

ఇదంతా వదిలేయండి... మెయిల్ కు సంబంధించినవే కాదు .. మిగతా అన్నీ అకౌంట్లు ఫోయినట్టే... అది ఎలా అంటే......

మీకు చాలా సైట్లలో అకౌంట్లు ఉంటాయి... దానిలోకి వెళ్ళి Forgot password అని నొక్కాడు అనుకోండి... reset link మీ email కు వస్తుంది కదా.. సో.... మెయిలే కాదు ఆ సైట్ కూడా హ్యాక్ చేసినట్టేగా ... FaceBook, Twitter,  రైల్వే అకౌంట్లు, paypal, DropBox , recharge sites,Bank sites  ఒక్కటేంటి ఇంక అన్నీ ఫోయినట్టే..... వాటి ద్వారా ఇంకేమైనా చెయ్యచ్చు..  లేని సైట్లలో రిజిస్టర్ చేసుకొని ఇంకేమైనా చెయ్యచ్చు....

మీరు కాకుండా ఎవరో మీలాగే ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుంది మీకు ?    చెప్పండి..... నిద్ర అయినా పడుతుందా ?

కాబట్టి  బలమైనా passwords వాడండి.ఎక్కువ special characters వాడండి (@ % ^ & * ! ~ ఇలాంటివి)......   వీలైతే తప్పకుండా two step verification వాడండి.. recovery settings లో మెయిల్ ఐడీ, answers కరెక్టుగా ఇవ్వండి... పోన్ నెంబర్లు అస్సలు వాడద్దు password గా..... 
ఇలా చేసుకొని హ్యాపీగా ఉండండి.....   కొల్ఫోయ్యాక బాధపడడం కంటే జాగ్రత్త పడడం మేలు...
ఒక మెయిల్ పోతే ఇంకోటి అనే భ్రమలో ఉంటే వెంటనే మారండి... కాదంటారా ?





FaceBook లో messages అన్నీ ఒకేసారి డిలీట్ చేసుకోవాలంటే..

FaceBook లో మనం చేసిన చాటింగ్స్ , మెసేజ్ లు అన్నీ సేవ్ అయ్యి ఉంటాయి.. వాటిని ఒక్కొక్కటి డిలీట్ చెయ్యాలి అంటే కష్టం గా ఉంటుంది కదా.. ఈ chrome extension వేసుకుంటే మెసేజస్ పక్కన  రెడ్ కలర్ x మార్కు వస్తుంది.. దాన్ని క్లిక్ చేస్తే ఆ వ్యక్తికి చేసిన మెసేజ్ లన్నీ ఒకేసారి డిలీట్ అవుతాయి..



Steps: 

1. Add This chrome extension --  Click Here
2. మీ FaceBook లోకి లాగాన్ అవ్వండి.
3. messages లోకి వెళ్ళండి.
4. అక్కడ డిలీట్ చెయ్యవలసిన వ్యక్తి పేరుకు కుడివైపున్న రెడ్ x ని నొక్కండి.. ఇలా..
5. ఇక అతనికి చేసిన మెసేజ్ లన్నీ ఒక్కసారికే డిలీట్ అవుతాయి..




కంప్యూటర్ కు Earth ఎందుకు ఇస్తారో తెలుసా ?

     కొంతమందిని నీ కంప్యూటర్ ఎందుకు చెడిపోయింది అని అడిగితే.. ఎర్త్ లేకపోవడం వల్ల కాలిపోయింది  అంటుంటారు.. అందుకే అసలు Earth అంటే ఏంటి అని రాయాలని నా చిన్న ప్రయత్నం...


Earth అనేది Voltage ని కొలవడానికి వాడే Reference point అనమాట.. (అంటే 0 volts)  
దాన్ని కంప్యూటర్ లేదా చాలా Devices కు ఇవ్వడానికి కారణాలు..

1. Metal తో చేసిన devices కాబట్టి Insulation fail అయితే షాక్ కొట్టే ప్రమాదం ఉంది.. కాబట్టి Electrical insulation fail అయినా షాక్ కొట్టకుండా ఉండడం కోసం...  


2. కంప్యూటర్ లాంటివి పని చేసేప్పుడు దానిలోని ఎలక్ట్రానిక్ parts లో కొంత వెస్టేజ్ కరెంట్స్ ఏర్పడుతాయి..కాబట్టి అలాంటి Unlimited current ను absorb చేసుకొని దానిలోని భాగాలు పాడవకుండా ఉంచడం కోసం Earth (Ground) కనెక్షన్ ఇస్తారు.... ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.. మనకి ఇవి చాలు...

ఈ ఎర్త్ సరిగా లేదు అనుకోండి మదర్ బోర్డు, Network cards కాలిపోయే  అవకాశాలు ఎక్కువ... అలా జరగకుండా ఉండాలి అంటే....  

ముందుగా కొన్ని తెలుసుకుందాం... 
3 Pin Plug లో  మూడుపిన్నులు ఉంటాయి. అవి 1.Phase    2. Neutral      3.  Earth (Ground)
 సాకెట్ లోని Pin-3  (Earth )  నుండీ  ఒక  వైరు తీసుకెళ్లి  ఇంటిబయట ఇలా ఒక Metal పైప్ ఏర్పాటు చేసి దానికి కనెక్షన్ ఇచ్చి ఉంటారు. దాన్నే Earth(Gorund) అని పిలుస్తారు.
కొన్ని సంవత్సరాల తరువాత  ఏదైనా కారణాల వల్ల ఆ వైరు తెగిపోవడం లేదా, కనెక్షన్ ఊడి పోవడం జరిగింది అనుకోండి...మన డివైజ్ లు పాడువుతాయి. అంతేకాదు బాడుగ ఇంట్లో చేరిన వాళ్ళకు owners ఎర్త్ ఏర్పాటు చేసారో లేదో  తెలీదు...అసలు Earth కనెక్షన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్నదానికి చిన్న చిట్కా చెప్తాను....


నిజానికి మనం వాడుతున్న ప్లగ్ నే చెక్ చెయ్యాలి... కానీ  అలా కాకుండా ఇంకో సులభమైన మార్గం..
 రెండు   సాకెట్స్ పక్కపక్కనే ఉన్నప్పుడు లోపల రెండింటికీ ఒకే earth కనెక్షన్ ఉంటుంది అన్నమాట.
అందుకని మన డివైజ్ (computer / grinder / Iron Box/ ఫ్రిజ్  ఏదైనా కావచ్చు.. కంప్యూటరే కాదు) పని చేస్తున్నప్పుడు ఒక టెస్టర్ తీసుకొని ఖాళీగా ఉన్న మరొక సాకెట్ లో ఇలా పెట్టండి.. Tester వెలిగింది అంటే Board నుండీ Earth Pipe వరకూ ఉన్న  wire తెగినట్టు అర్దం.. లేదా అసలు Earth అన్నదే మీరు ఏర్పాటు చేయ్యలేదని అర్దం...
అంతా కరెక్టుగానే ఉంటే  డివైజ్ పని చేస్తున్నాకానీ Tester వెలగదు...ఈ క్రింది Image లోలాగా..

చాలా మంది ఇలాంటి Spike busters, Plug Box లు  వాడుతుంటారు కదా ?   దానిలో ఖాళీగా ఉన్న ఏదో  ఒక సాకెట్  లోని Earth pin లో టెస్టర్ ఉంచి కూడా ఎర్త్ సరిగా ఉందో లేదో  తెలుసుకోవచ్చు..

చాలా మంది ఫ్రిజ్ డోర్ తీసినపుడు షాక్ వస్తుందనీ, ఐరన్ బాక్సు పట్టుకుంటే షాక్ వస్తుందనీ రకరకాలుగా చెప్తుంటారు.. అన్నింటికీ కారణం సరైనా Grounding లేకపోవడమే..  ఇలా చెక్ చేసుకొని. ఒకవేళ Ground సరిగా లేదు అని తెలిస్తే వెంటనే బాగుచేయించుకోండి.....


-----------------------------------------------------------------------------
(Board లో కన్నా Spike buster లో టెస్ట్ చెయ్యడం బెటర్...)
-------------------------------------------------------------------------------





Monday, April 30, 2012

వెబ్ పేజ్ లోని అన్నింటినీ డౌన్ లోడ్ చెయ్యాలంటే

మనం చూసే రకరకాల వెబ్ పేజీలలోని కంటెంట్స్ (ఆడియో, వీడియో,మెదలైనవి) సేవ్ చేసుకోవడానికి ఈ సైట్ చాలా ఉపయోగపడుతుంది..



  ముందుగా  http://file2hd.com/ అనే సైట్ ని ఓపెన్ చెయ్యండి..
1. దానిలో వెబ్ పేజ్ లింకును పేస్టు చెయ్యండి..
2. I have read and agree to the terms of service ముందు ఉన్న బాక్స్ ను చెక్ చెయ్యండి. 
3. ఆ పేజ్ లోని ఏ కంటెంట్ మీకు కావాలో సెలక్ట్ చేసుకోండి (ఆడియోనా, వీడియోనా  అలాగన్నమాట)
4. ఇప్పుడు Get files అని క్లిక్ చేస్తే ఆపేజ్ లోని వివిధ పైల్స్ లిస్టు వస్తుంది..
5. దానిలో మీకు కావలిసిన పైల్ పై రైట్ క్లిక్ చేసి save link as అనే ఆప్షన్ ఎంచుకోని మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోవచ్చు..


ఈ స్టెప్స్ ప్రకారం ఈ ఇమేజ్ లో చూపించాను..

  ఇంకా యూట్యూబ్ లింకును పేస్టు చెయ్యడం ద్వారా ఆ వీడియోలను MP4 లేదా FLV పార్మాటులలో సేవ్ చేసుకోవచ్చు,... సో డౌన్ లోడ్ టూల్ గా కూడా ఉపయోగ పడుతుంది...